దారి మళ్లించి మరీ దారుణం.. శంషాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శంషాబాద్ (Shamshabad) పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. విమానాశ్రయానికి వెళ్తున్న ఓ క్యాబిన్ క్రూ మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ నెల 20న మధ్యాహ్నం సమయంలో బాధితురాలు విమానాశ్రయానికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కగా, డ్రైవర్ కారును నిర్దేశిత మార్గంలో కాకుండా పక్కదారి పట్టించాడు. నిర్మాణంలో ఉన్న సాంక్టా మారియా స్కూల్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లాడు.

టాయిలెట్‌కు వెళ్తున్నాననే నెపంతో కారును పక్కకు ఆపిన డ్రైవర్, ఆ తర్వాత ఒక్కసారిగా వెనుక సీట్లోకి దూరి మహిళపై బలత్కారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం నిందితుడైన ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ (23)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనపర్తి జిల్లాకు చెందిన ప్రశాంత్ కుమార్ ప్రస్తుతం శంషాబాద్ మండలం సిద్ధాంతిలో నివసిస్తూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో, అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>