‘పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి కాంగ్రెస్.. కేసీఆర్(KCR) జపమే చేస్తుంది. కేసీఆర్‌ను విమర్శించకుండా, నిందించకుండా వారికి రోజే గడవడం లేదు’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిందని, ఇప్పటికి అయినా గత ప్రభుత్వంపై పడి ఏడవడం మానుకోవాలని హిత బోధ చేశారు. రెండేళ్లలో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గర పడుతున్న క్రమంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతన్నా ఇంకా కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ప్రతిదానికీ కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ను నిందిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసంచేస్తూనే పబ్బం గడుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం.. సీఎం రేవంత్ ఒక్కడే’’ అంటూ KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: విశాఖ.. హైదరాబాద్ కన్నా వేగంగా అభివృద్ధి అవుద్ది: నారా లోకేష్

