ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తన రాజకీయ ప్రయాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఆసక్తికర ట్వీట్ చేశారు. దానికి పవన్ కల్యాణ్ రిప్లై ఇవ్వడంతో ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. 2018 అక్టోబర్ 12న మొదలైన ప్రయాణం జనసేనతో తన రాజకీయానికి ఆరంభం పలికిందని మనోహర్ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఆనాటి ఫొటో ఒకదానిని షేర్ చేసుకున్నారు. ‘‘పవన్ దిశా నిర్దేశం, స్ఫూర్తినిచ్చే నాయకత్వం మాకెప్పుడూ బలమైంది. తిత్లీ తుఫాన్ తర్వాత శ్రీకాకుళంలో యువతతో కలిసి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌పై చర్చలు జరిపాం. యువత ఆకాంక్షించే ఏపీ కోసం కృషి చేస్తున్నాం’’ అని నాదెంట్ల తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏడేళ్ల రాజకీయ ప్రయాణం సేవ, స్ఫూర్తి, సంకల్పంతో నిండి ఉందని వివరించారు.
నాదెండ్ల(Nadendla Manohar) ట్వీట్‌కు పవన్ రిప్లై ఇస్తూ.. ‘‘వాళ్లు ఉచితాల కోసం అడగలేదు. సంక్షేమ పథకాలు కోరలేదు. ఒకే మాట చెప్పారు. మాకు ఉచితాలు కాదు భవిష్యత్తు కావాలి అని. 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండి. ఉచితాలు కాదు.. ఇదే యువత స్వరం అన్నారు. యువతలోని నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలి. వారి కలలు నెరవేర్చడానికి నేను నిరంతరం యువతను కలుస్తూనే ఉంటా’’ అని పవన్(Pawan Kalyan) పేర్కొన్నారు.
Read Also: రుషికొండ భవనాలను ఎలా వాడదాం.. సూచనలు అడిగిన ప్రభుత్వం

