గాంధీపై నటుడు శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్(Balmoor Venkat).. ‘మా’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ‘మా’ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ తీవ్ర పరిణామాలతో శ్రీకాంత్ దిగొచ్చాడు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కొన్ని రోజుల క్రితం తాను పెట్టిన ఒక పోస్ట్ చాలా మంది మనోభావాలను దెబ్బతీసిందని, వారందరికీ క్షమాపణలు చెప్తున్నా అని పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ పెట్టిన పోస్ట్ తీవ్ర వివాదానికి తెరలేపింది. అందులో గాంధీ(Mahatma Gandhi)పై అతడు చేసిన వ్యాఖ్యలను ఎంతో మంది తీవ్రంగా ఖండించారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా అతని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్.. చరిత్రను వక్రీకరించారని విమర్శించారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్(Srikanth Iyengar) క్షమాపణలు కోరారు.
Read Also: కేసీఆర్‌పై విమర్శలపై కేటీఆర్ గరమ్.. గరమ్..

