తెలంగాణ రాష్ట్రంలో పంటల కొనుగోళ్ల(Grain Procurement)పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా పంటల కొనుగోళ్లు సాగాలని అధికారులను తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో వర్ష సూచనల నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

