కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్న పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం చెలరేగితే.. ఇప్పుడు కొండా సురేఖ(Konda Surekha), పొంగులేటి మధ్య వాతావరణ వేడెక్కుతోంది. మేడారం(Medaram) ఆలయ టెండర్ల విషయంలో పొంగులేటి, కొండా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయంలోనే పొంగులేటిపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు కూడా చేశారు మంత్రి కొండా సురేఖ. మేడారం టెండర్ల విషయంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయశాఖకు చెందిన రూ.71 కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించడానికి పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ. తన శాఖలో మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy) జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? అంటూ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కొండా ఫిర్యాదుతో పొంగులేటిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలోనే పొంగులేటిపై కొండా సురేఖ(Konda Surekha) భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వరంగల్‌లో పొంగులేటి పెత్తనం ఏంటి? దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం తగదు. మేడారం టెండర్లను పొంగులేటి సొంత కంపెనీకి ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని పేర్కొంటూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు.
Read Also: బీపీడీతో జాగ్రత్త.. దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా..?

