epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అమరావతి రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌ న్యూస్‌..

అమరావతి రైతులకు(Amaravati Farmers) కూటమి ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు సొమ్మును జమ చేసింది. ఇందుకోసం మొత్తం రూ.6.64 కోట్ల నిధులను విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన కౌలును శనివారం జమ చేసింది. కాగా, రైతుల బ్యాంక్ లింకేజీలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కొందరికి ఇంకా డబ్బు జమకాలేదు. అదే విధంగా కొంతమంది రైతులు తమ ప్లాట్లను విక్రయించినందుకు, అదే విధంగా మరణించిన రైతుల వారసుల ఖాతాల సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది. కౌలు లబ్ధి జమ చేయడానికి నిర్ణీత ధ్రువపత్రాలు అధికారులకు అందిన తర్వాత నగదు జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

డబ్బులు జమకాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని, తమ బ్యాంకుల లింకేజీని పూర్తి చేసిన అనంతరం డబ్బు జమ అవుతుందని అధికారులు చెప్పారు. పలువురు రైతుల(Amaravati Farmers) ఖాతాలలో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి సొమ్ము కూడా జమ కానట్టుగా గుర్తించారు. ఇటువంటి సమస్యలను మరిన్ని పరిష్కరించిన సీఆర్డీఏ దాదాపు 495 మందికి అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలు నిధులను విడుదల చేసింది.

Read Also: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు.. ఆ మాటలే కారణం..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>