కలం వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై నిలదీస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో భాగంగా సోనియా గాంధీని కలిశారు. “తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్” పుస్తకాన్ని ఆమెకు అందించి, రాష్ట్రంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సోనియా గాంధీ అభయహస్తం పేరిట పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించి, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా మీరు, మీ కుటుంబసభ్యులు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మీ పార్టీ హామీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా?, సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు అయినా ఆరు గ్యారంటీల అమలు గురించి అడిగారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారంటే మీకు హామీల అమలుపై వాస్తవాలు తెలిసినట్లు లేదన్నారు. తెలంగాణ ప్రజలను వంచిస్తూ, మోసం చేస్తూ అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్‌తో కొత్త పల్లవి అందుకొని ఒకరినొకరు అభినందించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మూసీలో కలిపేశారా, గాంధీభవన్‌లో వదలేశారా అని తీవ్ర స్థాయిలో కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు.
Read Also: వాట్సాప్‌లో కొత్త మోసం… వీసీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Youtube


