కలం, వెబ్ డెస్క్ : 2026లో జరగబోయే మేడారం జాతర(Medaram Jathara)కు సంబంధించిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పెషల్ ట్వీట్ చేశారు. సమ్మక్క, సారలమ్మ చరిత్రలో పేద ప్రజల కోసం పోరాడారని.. బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మ, సారక్క చేసిన త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆ అమ్మల గద్దెలను ఆధునీకరించి రేపటి తరాలకు అందించే దైవ సంకల్పాన్ని తమ ప్రభుత్వం చేపట్టిందని రాసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
Read Also: వాట్సాప్‌లో కొత్త మోసం… వీసీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Instagram


