కలం వెబ్ డెస్క్ : వాట్సాప్‌లో సరికొత్త మోసం(WhatsApp Scam)మొదలైంది. యూజర్లు అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్(Sajjanar) హెచ్చరించారు. ఈ మేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. “హేయ్.. మీ ఫొటో చూశారా?” అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే పొరపాటున కూడా ఆ లింక్ పైన క్లిక్ చేయొద్దని సూచించారు. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్(Ghost Pairing Scam) అని పేర్కొన్నారు.
సదరు లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుందని, ఓటీపీ(OTP) గానీ, స్కానింగ్ గానీ లేకుండానే యూజర్లకు తెలియకుండానే వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. యూజర్ల వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారన్నారు. అలాగే ఫోన్‌లోని కాంటాక్ట్స్ లిస్ట్ కూడా దొరికిపోతుందన్నారు. ఇక తర్వాత యూజర్ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారని చెప్పారు. చివరికి యూజర్ కూడా వాడడానికి అవకాశం లేకుండా ఖాతాను లాక్ చేస్తారని హెచ్చరించారు.
వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దని సజ్జనార్ హెచ్చరించారు. యూజర్లు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్‌డ్ డివైసెస్(Linked Devices) ఆప్షన్‌ను తరచూ పరిశీలిస్తూ ఉండాలన్నారు. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయాలన్నారు. టూ స్టెప్ వెరిఫికేషన్(Two-step verification) తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలసి చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మోసాల(WhatsApp Scam) నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు.
Read Also: వాట్సాప్‌లో కొత్త మోసం… వీసీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Pinterest


