ఘనపూర్‌లో మల్టీపర్పస్ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

కలం, ఉట్నూర్: ఉట్నూర్ మండలం ఘనపూర్ (శంభుగూడ)(Ghanpur) గ్రామంలో పీఎం-జన్మన్ పథకం కింద రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవనానికి (Multipurpose Building) సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా మల్టీపర్పస్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవనం అందుబాటులోకి వచ్చిన అనంతరం గ్రామంలో వివిధ సామాజిక, ప్రజా కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>