కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సిలబస్ మార్పులు, సవరణలపై (TGPSC Syllabus Revision) సోషల్ మీడియాలో అభ్యర్థుల్లో వస్తున్న వరుస విజ్ఞప్తులు, ప్రశ్నలపై కమిషన్ బోర్డు స్పందించింది.
వివిధ ఉద్యోగాల సిలబస్‌ను సవరించడానికి టీజీపీఎస్సీ ఎలాంటి ప్రత్యేకమైన సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని బోర్డు స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్షల సిలబస్ లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన సమాచారాన్ని కనీసం ఒక సంవత్సరం ముందే అభ్యర్థులకు తెలియజేస్తామని కమిషన్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు.
పోటీపరీక్ష సిలబస్ లో ఏవైనా స్వల్ప మార్పులు ఉంటే సంబంధిత ఉద్యోగ నోటిఫికేషన్ తో పాటే ఆ వివరాలను విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. సిలబస్ (TGPSC Syllabus) మార్పులపై వస్తున్న పుకార్లను, ఊహాగానాలను నమ్మొద్దని కమిషన్ సూచించింది. టీజీపీఎస్సీ బోర్డు అధికారిక ప్రకటన ఆధారంగానే అభ్యర్థులు సన్నద్దత కావాలని కోరింది.
Also Read : సంతోష్ రావుకు అడ్డగోలుగా అక్రమాస్తులు: రమ్యా రావు
Follow Us On : WhatsApp

