కలం, కారేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక సంఘం పరిధిలోని 3, 4, 5 వార్డుల గుండా ప్రవహిస్తున్న బుగ్గవాగుకు ఇరువైపులా నూతనంగా రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) (Bugga Vagu Retaining Wall) మంజూరు కాగా, శనివారం ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోరం కనకయ్య (Koram Kanakaiah) ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి సమీపంలోని నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి.. పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బోళ్ళ సూర్యం, 3వ వార్డు కౌన్సెలర్ అజ్మీర వంశీ, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, నాయకులు రవిశంకర్, ఏఈ రాజు, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

