కర్ర వినాయకుని సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

కలం, నిర్మల్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకుని(Karra Ganapathi Temple) వద్ద సోమవారం యజ్ఞ కార్యక్రమంతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం హారతి కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు చిలమంతుల రాజలింగం, అధ్యక్షుడు కొమ్మోజి నారాయణ, ప్రధాన కార్యదర్శి కాసర్ల చంద్రశేఖర్, కోశాధికారి పాంచాల్ గంగా ప్రసాద్, ఆలయ పూజారి, కర్రపారి శ్రామిక సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>