ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు వరంగల్ సీపీ ప్రోత్సాహం

కలం, హనుమకొండ: ప్రత్యేక విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి సృజనాత్మకతకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (Warangal CP Swetha) ప్రోత్సాహం అందించారు. హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన ప్రత్యేక విద్యార్థులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను శనివారం ఆమె సందర్శించారు.

విద్యార్థులు స్వయంగా తయారుచేసిన హ్యాండ్‌మేడ్ వస్తువులను కొనుగోలు చేసి వారి నైపుణ్యాన్ని సీపీ (Warangal CP) అభినందించారు. ప్రత్యేక విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని సీపీ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, సురేష్, ఆర్ఐలు సర్జన్‌రాజ్, సతీష్, శ్రీధర్, మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు రామలీల, ఈసీ సభ్యుడు కల్యాణ్, కేంద్రం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>