Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమ జంతు రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు

కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఖమ్మం (Khammam)జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో అక్రమంగా జంతువులను తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. అలాగే జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

“జిల్లాలో ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేయడం లేదా వధించడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎక్కడైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు తెలపాలి. అంతే తప్ప, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు” అని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తిగత దాడులకు పాల్పడినా, గుంపులుగా దాడులు చేసినా అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలపై విద్వేష పూరిత పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు లేదా అసత్య ప్రచారాలు చేసే వారిపై జిల్లా పోలీస్ మానిటరింగ్ సెల్ నిరంతర నిఘా ఉంచిందని ఎస్పీ తెలిపారు. రూమర్లు వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తే కటకటాల పాలు కాక తప్పదని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>