మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా జీహెచ్ఎంసీ మాజీ మేయర్

కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మహిళా కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్ గా జీహెచ్‌ఎంసీ తాజా మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్ తో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. ఈ నియమాకాల్లో తెలంగాణ ఉద్యయం, సామాజిక సేవ, మహిళా హక్కుల ఉద్యమాల్లో పనిచేసిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరాలను కూడా ప్రభుత్వం నియమించింది.

ముందే చెప్పిన కలం

Gadwal Vijayalakshmi
Gadwal Vijayalakshmi

Read Also: ఎస్ఐఆర్‌పై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>