Mobile Popup Ad
Mobile Popup Ad

తెల్లారితే నిశ్చితార్థం..ఇంతలోనే యువకుడి దుర్మరణం!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా మద్దుల పల్లి స్టేజ్ వద్ద విషాదం చోటు చేసుకుంది.బుధవారం నిశ్చితార్థం జరుపుకోవాల్సిన వ్యక్తి ప్రమాద వశాత్తూ మృతి చెందాడు. మద్దులపల్లి కి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి రోడ్డు అవతల ఉన్న షాపుకి వెళ్లి, తిరిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తెల్లవారితే నిశ్చితార్థం చేసుకోవాల్సిన వ్యక్తి అనంత వాయువుల్లో కలిసి పోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ప్రసాద్ డివైడర్ కు ఒక వైపు ఉన్న రోడ్డును రెండు వాహనాల మధ్య నుంచి దాటుకొని వెళ్లినట్లుగా గమనించారు. తదుపరి డివైడర్ ను కూడా దాటాడు. డివైడర్ కు అవతలి వైపు ఉన్న రోడ్డును దాటే క్రమంలో వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో ప్రసాద్ మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, సీఐ ముష్కరాజ్ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read Also: గడ్డిమందు పారాక్వాట్‌పై నిషేధం.. ఉత్తర్వులు జారీ

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>