కలం, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వీలుగా మెట్రో టైమింగ్స్ (Metro Timings) పొడిగించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజూ రాత్రి 11గంటలకు చివరి మెట్రో అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, పండగలు, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్న సందర్భాల్లో మెట్రో తన సర్వీసుల వేళల్ని పొడిగిస్తోంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఈ నెల 31 బుధవారం రాత్రి 1గంట వరకు మెట్రో రైళ్లను నడపనుంది. ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1గంటకు చివరి మెట్రో బయలుదేరుతుంది. ఈ మేరకు మెట్రో అధికారులు మంగళవారం వెల్లడించారు.
Read Also: ధరలు పెంచొద్దు.. క్యాబ్, ఆటో డ్రైవర్లకు సజ్జనార్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


