కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్(KCR) సానుకూల సలహాలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu కోరారు. కేసీఆర్ హయాంలో కూడా అనేక పెట్టుబడి ఒప్పందాలు జరిగాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు గమనించడం లేదో అర్థం కావడం లేదని వాపోయారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం నిరంతర ప్రక్రియ అని, పెట్టుబడులకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో కంపెనీలు అక్కడే పెట్టుబడులు పెడుతాయని వెల్లడించారు. తమ ప్రభుత్వం విదేశాల నుంచి అనేక పెట్టుబడులను ఆహ్వానిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిపిస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఏ ఒక్క ప్రభుత్వానికి పరిమిత కాదని, ఇది నిరంతర ప్రక్రియగా మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ స్థిరమైన పాలన వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని శ్రీధర్‌బాబు తెలిపారు.
Read Also: స్నేహితులు.. తెలిసినవాళ్లే కీచకులు
Follow Us On: Youtube


