Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్ పై కేసీఆర్ రియాక్షన్ ఇదే..!

కలం, వెబ్​ డెస్క్​ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వెల్లడించారు. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులతో నిర్వహించిన భేటీలో ఆయన ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్​ఎస్​ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లపై తీర్మానం చేశామని గుర్తుచేసిన ఆయన, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు. అయితే ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఉంటే తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉందని, సీట్ల సంఖ్య పెరిగినప్పుడు కూడా ఆ వాటా తగ్గకుండా కనీసం 50 శాతం మేర పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ విభజన చేపడితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ బిల్లులోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ ఒక తుది నిర్ణయానికి వస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ రాజకీయ పరిణామాలతో పాటుగా ఈ నెల 20న నిర్వహించనున్న జగిత్యాల బహిరంగ సభ, అలాగే 27వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కూడా కేసీఆర్ (KCR) నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పండుగ వాతావరణంలో పార్టీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆయన సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>