కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరగనున్నది. ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే విషయాలపై చర్చించనున్నారు.
పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ (KCR) చర్చిస్తున్నారు. సభల వేదికలు సభలు ఎక్కడ నిర్వహించాలి? ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తే జన సమీకరణ సులభం అవుతుంది? అనే అంశాలపై ఆయా జిల్లాల నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే నెలలో నిర్వహించబోయే ఈ సభల తేదీలపై కసరత్తు చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఈ సభలను రూపొందించాలని నేతలకు సూచించారు. డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: సీఎం రేవంత్, కేటీఆర్ తిట్ల పురాణం
Follow Us On: Youtube


