కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. ఇంకిలాబ్ మోంచో నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడ దాడులు జరుపుతున్నారు. మొన్న 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ మీద దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత మరో మైనార్టీ యువకుడిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. మిగతా వారి ఇండ్ల మీద దాడులు జరుగుతున్నాయి. వీటన్నింటిపై భారత్ (Bharat) స్పందిస్తూ.. ‘అతివాద శక్తులు చేస్తున్న ఇలాంటి దారుణాలను ఖండిస్తున్నాం. వీటిని రాజకీయ చర్య లేదా మీడియా ప్రచారంగా మేం చూడలేం’ అంటూ ప్రకటించింది.
విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా ముఖంగా ఈ విషయాలను వెల్లడించారు. హిందువుల మీద దాడులు చేస్తున్న వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడుతారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక వేల కోట్లు బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీని త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామన్నారు. అందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు.
Read Also: భారత వ్యతిరేక ఆందోళనల కేంద్రంగా ఢాకా యూనివర్సిటీ
Follow Us On: Pinterest


