Mobile Popup Ad
Mobile Popup Ad

నేను ఇన్‌ఫ్లుయెన్స‌ర్ అయితే అదే కంటెంట్ చేస్తా… ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) జెన్ జీని ఆక‌ట్టుకుంటూ వినూత్న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌న‌సేనాని విత్ జెన్ జీ (Gen Z) అనే ప్రోగ్రామ్‌లో యువ‌తో మాట్లాడి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. జెన్ జీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ, కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ఈ ప్రోగ్రామ్‌లో ఓ యువ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న వేశాడు. ఈ రోజుల్లో మీరు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ అయ్యుంటే ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తార‌ని అడిగారు. దీనికి ప‌వ‌న్ కల్యాణ్ ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు.

తాను ఒక ఇన్‌ఫ్లుయెన్స‌ర్ అయితే అసలు ఎక్కువ‌గా మాట్లాడ‌న‌ని ప‌వ‌న్ (Pawan Kalyan) బ‌దులిచ్చారు. అయితే త‌న‌కు దేశభక్తి, జాతీయ సంరక్షణ అంశాలు ఇష్ట‌మ‌ని, దాని పైనే కంటెంట్ క్రియేట్ చేస్తానని వివ‌రించారు. సమాజానికి ఉపయోగపడే, దేశ ప్రయోజనాలను కాపాడే అంశాలకే తాను ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కే ప‌రిమితం కాకుండా దేశానికి ఉప‌యోగ‌ప‌డేలా త‌న ఆలోచ‌న‌లు ఉంటాయ‌న్నారు. అందుకే మీరంటే అందరికీ ఇష్టమంటూ ప్రశ్న అడిగిన యువకుడు నవ్వేశాడు.

Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>