కలం, వెబ్ డెస్క్: తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడిగా పేరుగడించిన కేసీఆర్ (KCR).. రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సీఎంగా రికార్డు క్రియేట్ చేయాలని కేసీఆర్ ఎన్నో కలలు కన్నాడు. కానీ కానీ, 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో గత రెండు సంవత్సరాలు ఆయన క్షేత్రస్థాయికి దూరంగా ఉంటూనే వస్తున్నారు. కాంగ్రెస్ విజయం తరువాత కేసీఆర్ పెద్దగా బయటకు వచ్చిన సందర్బాలు లేవు.. ఫామ్ హౌస్ కే పరిమితమయిపోయారు.
ఉప ఎన్నికలకు దూరంగా..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోను బీఆర్‌ఎస్ అధినేతగా కేసీఆర్(KCR) ప్రచారం చేయాల్సి ఉండేది. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్లుగా ఎన్నికలవేళ ఒక్కసభలో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూడా అదే రిపీట్ అవుతోంది. ఈసారి కేసీఆర్ తో పాటు బీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు కూడా పంచాయతీ ఎలక్షన్లను లైట్ తీసుకున్నారనే సందేహం కలుగుతోంది. దీనికి కారణం బీఆర్‌ఎస్ ఎలాంటి సమావేశాలు, మీటింగ్ నిర్వహించకపోవడమే.
KTR కోసమే ఇదంతా చేస్తున్నారా?
కేసీఆర్ తరువాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న కేటీఆర్ అగ్రనేతగా చలామణి అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సీఎం అభ్యర్థిగా కేటీఆర్ కు అవకాశం దక్కితే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే బీఆర్‌స్ ప్రభుత్వ హయాంలో షాడో సీఎంగా కేటీఆర్ కొనసాగారని చాలామంది మాట్లాడుకున్నారు. పరిపాలనలో ముఖ్యపాత్ర కేటీఆర్ నిర్వహించారు అనేది అందరికి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేటీఆర్, హరీశ్ రావు ముందుండి ప్రభుత్వంపై దాడి చేశారు. అయితే, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని భావనతోనే కేసీఆర్..కేటీఆర్ పైనే భారం వేశారని పార్టీలో చర్చించుకుంటున్నారట. అయితే, కేసీఆర్ బయటకు రాకపోవడం వల్ల పార్టీకి నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతపై విజి‘లెన్స్’
Follow Us On: X(Twitter)


