కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.. మరోవైపు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో కేంద్ర నేతలతో మంచి సంబంధాలున్నాయి. వివిధ పార్టీల నేతలు ఇప్పటికీ ఆమెతో టచ్‌లో ఉన్నారు. తన రాజకీయ అనుభవంతో తెలంగాణకు నిధులు తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కవిత స్పందించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల (Kerala Elections) వేళ LDF కూటమికి మద్దతు ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను (Six Guarantees) అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలను వంచించారని ఆమె ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. కేరళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పినరయి విజయన్ నాయకత్వమే ప్రగతికి బాటని పేర్కొన్న కవిత (Kavitha) వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also: డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. దెబ్బతిన్న వాహనాలు
Follow Us On : WhatsApp

