బనగానపల్లెలో దారుణ ఘటన.. భార్యను గొడ్డలితో చంపిన వృద్ధుడు

కలం, వెబ్ డెస్క్ : నంద్యాల (Nandyal) జిల్లా బనగానపల్లె (Banaganapalle) మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కట్టుకున్న భార్యనే ఓ వృద్ధుడు గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వెంకన్న అనే వ్యక్తి తన 60 ఏళ్ల భార్యతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకే తరచూ వాగ్వాదాలు జరుగుతుండగా, ఆ వివాదాలు క్రమంగా తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన వెంకన్న, ఓ రోజు ఇంట్లోనే గొడ్డలితో భార్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం, తన నేరాన్ని దాచిపెట్టేందుకు ఇంటికి తాళం వేసి వెంకన్న పరారయ్యాడు.

ఈ ఘటన మూడు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా దాగి ఉంది. అయితే ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలి మృతదేహం కనిపించింది. ఈ దృశ్యం చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: అణుశక్తి రంగంలో దూసుకుపోతున్న భారత్: సీఎం చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>