రైల్ రోకో కేసులో కవితకు సమన్లు!

కలం, వెబ్ డెస్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (Kavitha) అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైల్ రోకో ఘటనలో (Kamareddy Rail Roko) కవితకు చుక్కెదురైంది. ఈ నిరసన కార్యక్రమం వల్ల రైల్వే రవాణాకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసును విచారిస్తున్న సికింద్రాబాద్ రైల్వే కోర్టు, రేపు (బుధవారం) విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

గతంలో జరిగిన ఈ ఆందోళనలో రైల్వే చట్టాలను ఉల్లంఘించారనే కారణంతో కవితతోపాటు మరో 12 మంది టీఆర్ఎస్ (TRS) నాయకులపై కూడా రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రజా రవాణాకు విఘాతం కలిగించిన అంశంపై కోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో ఈ కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. జనగణన, కులగణన అంశంపై రాజకీయంగా పోరాడుతున్న తరుణంలో కవితకు (Kavitha) సమన్లు జారీ కావడం చర్చనీయాంశమవుతోంది.

Read Also: ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు: కేసీఆర్ కు స్పెషల్ రిక్వెస్ట్ !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>