కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ క్రియాశీలకంగా మారి పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సూచించారు. ప్రస్తుత నాయకత్వంపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎవరికైతే బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారో వారికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ లో జరిగిన ఒక ఘటనను ప్రస్తావిస్తూ అప్పట్లో బోర్డు చైర్మన్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో గుర్తు చేసుకోవాలని ఓవైసీ ప్రశ్నించారు.
బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడి ఉదంతంపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే కోరారని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు తనపై చూపిస్తున్న ప్రేమ వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించుకోవాలని హితవు పలికారు. ఆలయ సమీపంలో గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకోవాలని ఓవైసీ (Asaduddin Owaisi) విమర్శలు సంధించారు. రాజకీయాల్లో వారసత్వ పగ్గాల అప్పగింత కంటే అనుభవం కలిగిన వారే కీలమని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Read Also: బండి భగీరథ్ పోక్సో కేసు.. సిట్ కీలక అడుగు
Follow Us On: Instagram

