కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ఆరంభంలోనే తనదైన పాలన మార్క్ తో అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. తమిళనాడులోని ప్రార్థన మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని సీఎం విజయ్ జారీ చేసిన ఆదేశాలతో ఆ రాష్ట్రంలోని 717 మద్యం షాపులు మూతపడనున్నాయి. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా పశ్రంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ నటుడు విశాల్ (Vishal) ప్రశంసలు కురిపించారు.
”హ్యాట్సాఫ్ టు యూ విజయ్ (Vijay). 717 వైన్ షాపులను, ముఖ్యంగా పాఠశాలల సమీపంలోని వాటిని మూసివేయాలన్న మీ ప్రకటన అభినందనీయం. ఈ షాపుల వల్ల ఎంతో మంది బాలికలు వేధింపులకు గురవుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. సామాన్య ప్రజలు మిమల్ని, మీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మీకు, మీ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను” అంటూ విశాల్ (Vishal) సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
Read Also: హిందూ ఏక్తా యాత్ర ర్యాలీకి పటిష్ట బందోబస్తు: పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
Follow Us On : WhatsApp

