Mobile Popup Ad
Mobile Popup Ad

70 కోట్ల మంది మహిళల జీవితాలతో ఆటలాడుతోంది.. బీజేపీపై కవిత ఫైర్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును ఒక ‘పోస్ట్ డేటెడ్ చెక్‌’గా అభివర్ణించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ (BJP) మహిళా రిజర్వేషన్ నాటకం ఆడుతోందని విమర్శించారు. దేశంలోని 70 కోట్ల మంది మహిళల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందన్నారు. రిజర్వేషన్లకు డిలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. తక్కువ జనాభా ఉన్న దక్షిణ భారతదేశానికి డిలిమిటేషన్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీ వైఖరి వల్ల కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతోందని ఆరోపించారు. మహిళల పట్ల కేంద్రం కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు. జాగృతి ద్వారా మహిళలకు పెద్ద పీట వేస్తామని కవిత స్పష్టం చేశారు.

Read Also: నితీష్​ కుమార్​ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>