ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ!.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Elections) వేళ రాజకీయ పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ జనతా పార్టీ  తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను (BJP Manifesto) రిలీజ్ చేసింది. సీనియర్ బీజేపీ నాయకుడు జేపీ నడ్డా  ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే. అన్నామలై, తమిళ సై సౌందర్య రాజన్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల కల్పన, హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు.

ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ప్రతి ఇంటికి 11,000!

బీజేపీ తన మేనిఫెస్టోలో (BJP Manifesto) మహిళలకు పెద్ధ పీట వేసింది. ప్రతి ఇంటిలో మహిళా యజమానురాలికి నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. అటు ఈ-స్కూటర్ కొనుగోలు చేసే మహిళలకు రూ. 25,000 సాయం, మహిళల పేరున ఇల్లు కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీలో 3 శాతం రాయితీ అందిస్తామని తెలిపింది. ప్రతి ఇంటికి ఒకేసారి రూ.11,000 నగదును కూడా అందజేస్తామని వెల్లడించింది. అటు భగవాన్ మురుగన్ గౌరవార్థం తైపూసం పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని కూడా హామీ ఇచ్చింది. తమిళ సంస్కృతికి ప్రతీకైన జల్లికట్టుకు పూర్తి మద్దతు ఇస్తామని.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం అందిస్తామని తెలిపింది. ఆటలో ఎవరైనా మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా హామీ ఇచ్చింది.

అన్ని పార్టీల మేనిఫెస్టోలు రిలీజ్

కాగా, ఏఐఏడీఎంకే (AIADMK) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమిలో భాగంగా 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఇప్పటికే తన మిత్రపక్షం AIADMK తో పాటు DMK, విజయ్ TVK పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మరి తమిళనాట ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోకు ఆదరణ దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also: క్యాబినెట్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటి?: జగ్గారెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>