పదేండ్లు మౌనంగా ఉన్నా.. : కవిత

కలం, వెబ్‌ డెస్క్‌ : పదేళ్ల పాటు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి మౌనంగా ఉన్నానని, అంతర్గతంగా విభేదించినా పార్టీ అధినేత నిర్ణయానికే తలొగ్గాల్సి వచ్చిందని కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆమె తన మనసులోని మాటను పంచుకున్నారు. గతంలో జరిగిన కొన్ని పొరపాట్లపై ఆమె ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు రుజువైతే స్తంభానికి కట్టేసి కొట్టాలని పేర్కొన్నారు. తాను ఇచ్చే హామీలను భవిష్యత్తులో నెరవేర్చకపోతే అమరవీరుల స్థూపానికి కట్టేసి కొట్టొచ్చని, శిక్షను అనుభవించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

Read Also: బీజేపీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌కు అస్త్రం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>