కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్ కవిత (Kavitha) కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ సందర్భంగా సిరిసిల్ల (Sircilla) జిల్లా నుంచి అభిమానులు భారీ పాదయాత్రను చేపట్టారు. వినయ్, సతీశ్ నాయకత్వంలో సుమారు 100 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్ల ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర సిద్దిపేట ద్వారా కొనసాగి ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ చేరుకోనుంది. అదేరోజు అక్కడ నిర్వహించ తలపెట్టిన పార్టీ ఆవిర్భావ సభలో ఈ బృందం పాల్గొంటుంది. ఈ కీలక సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

