‘ప్రధాని మోదీని నేను అలా అనలేదు’.. ఖర్గే ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీని (PM Modi) కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) ఉగ్రవాది అని పేర్కొనడం జాతీయ రాజకీయాల్లో వివాదస్పదంగా మారింది. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మరో ప్రకటన చేశారు. ప్రధాని మోదీని తాను ఎప్పుడూ నిజమైన ఉగ్రవాది అని అనలేదని తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలతో బెదిరింపులకు పాల్పడతారని తెలపడమే తన ఉద్దేశమని అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయబ్రాంతుకులకు గురిచేస్తున్నారనే క్రమంలో తాను ఆ వ్యాఖ్యలను చేసినట్లు వివరణ ఇచ్చారు.

మంగళవారం తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే (Kharge) మాట్లాడుతూ.. ఉగ్రవాది లాంటి మోదీతో AIADMK ఎలా పొత్తు పెట్టుకుందని వ్యాఖ్యానించారు. మోదీతో పాటు ఆయన పార్టీ సమానత్వాన్ని , న్యాయాన్ని నమ్మదని ఆరోపించారు. ప్రధాని మోదీ దక్షిణాది హక్కులను కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారితో చేరడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచినట్లేనని తెలిపారు. మోదీతో కలిసి AIADMK అన్నాదురై, కామరాజ్, పెరియార్, కళైజ్ఞర్, బాబా సాహెబ్ అంబేద్కర్ తత్వాలను బలహీనపరుస్తుందని పేర్కొన్నారు.

Read Also: కేరళ ఘటన.. ప్రధాని మోదీ దిగ్భాంతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>