కలం, ఖమ్మం బ్యూరో: విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ (Collector Ankit) అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వారం కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ బూర్గంపహాడ్ (Burgampahad)లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (Kasturba Gandhi Balika Vidyalaya – KGBV)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా కార్యక్రమాల అమలు, పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్ (Collector Ankit), విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని, మరింత విస్తృతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించి, మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, ఆహార తయారీలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలపై కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ (MPDO) జమలా రెడ్డి, తహశీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: 25 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై.. ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన MBA గ్రాడ్యుయేట్!
Follow Us On: X(Twitter)

