కలం, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ‘ఆస్క్ కవిత’ (Ask Kavitha) పేరుతో నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక కామెంట్స్ చేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) నిర్మాణంలో భాగంగా గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు పై స్పందించారు. నిదానంగా మొదలైనా పటిష్టంగా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌కు మాత్రమే తాము పరిమితం కాలేదని.. రాష్ట్రమంతా తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈస్ట్ ప్రాంతానికి లభించడంలేదని, ప్రభుత్వాలు ఏవైనా అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు.
పార్టీ పేరు ఏం ఉంటే బాగుంటుందో చెప్పండని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడంలో జాప్యం జరగడం చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా వీలైనంత తొందరగా బకాయిలను విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా తన శక్తి మేరకు వాటిని ఎదుర్కొంటానని చెప్పారు. 2018-19లో ఇచ్చిన హామీలను మర్చిపోయిన మీ మాటల్ని ఇప్పుడు ఎలా నమ్మగలుగుతాం? అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు “ఐ యామ్ సారీ… ఇప్పటికైనా నా నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆమె బదులిచ్చారు.
“కేసీఆర్ పేరు తగిలించుకున్న మీరు రాజకీయాల్లో అన్ ఫిట్.. హాయిగా బిజినెస్‌పై దృష్టి పెట్టండి” అని ఒక నెటిజెన్ ప్రశ్నకు “సోషల్ మీడియాలో విషం చల్లడం నుంచి తప్పుకుంటే మంచిది… మీ మైండ్‌సెట్‌ను క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది” కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సెక్షన్లకు చెందినవారికి సాధికారత కల్పించేలా జాగృతి కమిటీల్లో తగిన ప్రయారిటీ ఉంటుందన్నారు. జయలలిత తరహాలో రాజకీయంగా చాలా స్ట్రాంగ్ కావాలి.. ముఖ్యమంత్రి అయ్యి బలమైన నాయకత్వాన్ని అందించాలి..” అనే మరో ప్రశ్నకు ‘నమస్కారం’తో Ask Kavitha లో జవాబు ఇచ్చారు.
Read Also: సర్పంచ్ ఎన్నికల్లో సీఎం తిరగడం చరిత్రలో ఎప్పడూ చూడలేదు : కేటీఆర్
Follow Us On: Youtube


