epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బాధ్యతలు స్వీకరించిన నితిన్​ నబీన్​

కలం, వెబ్​డెస్క్​: భారతీయ జనతా పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నితిన్​ నబీన్ (Nitin Nabin)​ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు. నబీన్​ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బిహార్​లోని బంకీపూర్(Bankipur )​ నుంచి ఆ రాష్ట్ర శాసనసభకు నితిన్​ నబీన్​ ఐదుసార్లు ఎంపికయ్యారు. ప్రస్తుతం బిహార్​ రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్ష స్థాయికి చేరారు.

Read Also: కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన తిలక్ వర్మ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>