epaper
Tuesday, November 18, 2025
epaper

సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి.. కవిత సూచన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన భాష మార్చుకోవాలని తెంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha) సూచించారు. కళాశాలలను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబు కాదన్నారు. ఆయన మాటలు.. వీధి రౌడీలకన్నా దారుణంగా ఉన్నాయన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తప్పు చేసిందని, అందుకు నిరసన విద్యార్థులు నిరసన బాట పడితే వారిని బెదిరించడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు కవిత. వరంగన్ హన్ముకొండలో జాగృతి జనం బాట కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగానే కళశాళాలు తాము మద్దతుగా నిలుస్తామని కవిత హామీ ఇచ్చారు. అంతేకాకుండా రేవంత్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘పాత బకాయిలతో పాటు ఈ ఏడాది బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పారు. కానీ నిన్న ప్రెస్ మీట్ లో వీధి రౌడీలు కూడా సిగ్గు పడే విధంగా మాట్లాడారు. కాలేజీల యాజమాన్యాల తోలు, తాట తీస్తారంట. ఎందుకు తోలు తీస్తారు సీఎం? ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ కాలేజ్ లను మన ప్రాంతంలో పెట్టకపోతే వారే ఆ బాధ్యత తీసుకున్నారు. లోన్లు తీసుకొని, పైసా పైసా కూడా బెట్టి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజ్ లు ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థులకు విద్య అందించినందుకు వారి తాటా తీస్తారా?’’ అని నిలదీశారు.

‘‘మీరు ఇచ్చిన మాట తప్పినందుకే కాదా? వాళ్లు కాలేజ్ లు బంద్ చేశారు. మేము కూడా సింబాలిక్ గా మాత్రమే బంద్ నిర్వహించాలని వారికి అప్పీల్ చేశాం. కాలేజ్ లు నడపలేని పరిస్థితి రావటంతోనే వారు బంద్ చేశారు. మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు. కానీ కాలేజ్ యాజమాన్యాలకు ఎందుకు ఇవ్వటం లేదు. పైగా కాలేజ్ వాళ్ల మీద మీరు వీరంగం ప్రదర్శించారు. 18 వందల కాలేజ్ లు ఉంటే 2 కాలేజీల పేర్లు చెప్పారు. వాళ్లు పర్మిషన్లు అడిగితే… నిబంధనలకు విరుద్దమైతే వారికి పర్మిషన్ ఇవ్వకండి’’ అని పేర్కొన్నారు.

‘‘కానీ మిగతా వారంతా ఏం చేశారు. అక్కడి విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తారు? వాళ్లు కచ్చితంగా తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడ్డారు. మీరు మాట తప్పి…వాళ్లను బెదిరిస్తారా? నిన్న ప్రభుత్వం డబ్బులు చెల్లించాక వాళ్లు కాలేజ్ లను స్టార్ట్ చేశారు. ఐతే విద్యార్థులు నష్టపోకుండా వారికి చదువు చెప్పాలని కాలేజ్ యాజమాన్యాలను కోరుతున్నా. పిల్లల మీద వివక్ష వద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే మీ తరఫున మేము పోరాటం చేస్తాం. రెండు రోజుల పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నాం. మొత్తం 5 నియోజకవర్గాల్లో తిరుగుతాం. ఇక్కడ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాం’’ అని కవిత(Kavitha) తేల్చి చెప్పారు.

Read Also: తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఏ పార్టీకి?

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>