యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లెటెస్ట్ మూవీ ‘కే-ర్యాంప్(K Ramp)’. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్ అందుకుంది. హిట్‌గా నిలిచింది. ఏమాత్రం ఉంటుందో అనుకున్న ఫ్యాన్స్‌ను ఫుల్‌మీల్స్ ఫీల్ ఇచ్చిందీ మూవీ. సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. కే-ర్యాంప్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘కే-ర్యాంప్(K Ramp)’కు అందుతున్న ఆదరణపై సంతోషం వ్యక్తం చేసిన మేకర్స్.. ఈ మూవీ నవంబర్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని వెల్లడించారు. ఆహా(Aha)లో ఈ మూవీని చూడొచ్చని ప్రకటించారు.
Read Also: విజయ్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మిక
Follow Us on : Pinterest

