మహేష్ బాబు(Mahesh Babu)తో తీస్తున్న సినిమా కోసం రాజమౌళి.. కీలక పాత్రను కాపీ కొట్టాడా? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న సినిమా SSMB 29. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా పృథ్వి క్యారెక్టర్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్.. జక్కన్న మళ్ళీ కాపీ కొట్టాడని, మరీ ఇలా చేస్తున్నాడేంటంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో పృథ్వి పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే SSMB 29 లో ఈ పోస్టర్‌లో పృథ్వి రాజ్(Prithviraj Sukumaran).. అంగవైకల్యంతో వీల్‌చైర్‌లో కూర్చుని ఉంటాడు. ఆ కుర్చీ వెనకాల నుంచి రోబోటిక్ చేతులు తరహాలో నాలుగు కనిపిస్తున్నాయి. దీనిని చూసిన నెటిజన్స్.. స్టీఫెన్ హాకింగ్స్, మార్వెల్‌లోని డాక్టర్ ఆక్టోపస్‌ను మిక్సీలో వేసి తీస్తే ఈ క్యారెక్టర్ వచ్చిందా.. జక్కన్న అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే రాజమౌళి(SS Rajamouli) ఫ్యాన్స్ మాత్రం.. సెటైర్లు తిప్పి కొడుతున్నారు. ఎంతో మేధోమథనం తర్వాతే ఈ లుక్‌ను ఫైనల్ చేసి ఉంటారని, మనకు కనిపించేది జక్కన్న ఒక్కడే అయినా ఆయన వెనక భారీ టీమ్.. దీనిపై రాత్రింబవళ్లు కసరత్తులు చేసి ఉంటుందని అంటున్నారు. మరి ఈ ట్రోల్స్ రాజమౌళి ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
Read Also: ఓటీటీ లోకి K-Ramp.. ఎప్పుడో చెప్పిన మేకర్స్
Follow Us on: Instagram

