కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఖిల్లా రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అనిల్ దంపతులు పాల్గొన్నారు. సీతారాములకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు భారీసంఖ్యలో హాజరయ్యారు. ఖిల్లా రఘునాథ ఆలయం జై శ్రీరామ్ ద్వాణాలతో మార్మోగింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. రామనవమి సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Read Also: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ : కేంద్రం కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

