Mobile Popup Ad
Mobile Popup Ad

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ : కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ (BSNL) నెట్‌వర్క్ పరిధిని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అదనంగా 50,000 నుండి 60,000 కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విస్తరణ ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు 4G సేవల విస్తరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.20,000 కోట్లను వెచ్చించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న దాదాపు 98,000 మొబైల్ టవర్లను త్వరలోనే 5G టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ చర్యల ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది.

Read Also: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ప్రమాదం !

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>