సీఎస్‌కే టాప్ బ్యాటర్ అతడే.. అశ్విన్ ఆసక్తికర జోస్యం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శనపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్‌లో సీఎస్‌‌కే తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నిలుస్తాడని జోస్యం చెప్పారు. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న సంజు శామ్సన్ కంటే గైక్వాడ్ అద్భుతంగా రాణించే అవకాశం ఉందని, పరుగుల విషయంలో కూడా సంజూను గైక్వాడ్ అధిగమించేయొచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. రుతురాజ్ మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని అశ్విన్ పేర్కొన్నారు. ఆయన ఇన్నింగ్స్ చివరి వరకు ఉండి యాంకర్ పాత్ర పోషిస్తారని, మిగిలిన బ్యాటర్లు ఆయన చుట్టూ వేగంగా పరుగులు సాధిస్తారని వివరించారు. ఈ కారణంగానే గైక్వాడ్ ఖాతాలో భారీగా పరుగులు చేరుతాయని అశ్విన్ విశ్లేషించారు.

సీఎస్‌కే ప్లేఆఫ్స్‌ చేరాలంటే వాళ్లే కీలకం

సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరాలంటే టాప్ ఆర్డర్‌లోని కనీసం ఇద్దరు బ్యాటర్లు తలా 500 పరుగులు చేయాలని అశ్విన్ సూచించారు. కాగితంపై బౌలింగ్ విభాగం అంత బలంగా లేకపోయినా, గతంలోలాగే జట్టు వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే బౌలర్లను కనుగొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లు లీగ్ ప్రారంభ మ్యాచులకు దూరం కావడం సీఎస్‌కేకు కలిసివచ్చే అంశమని అశ్విన్ (Ashwin) పేర్కొన్నారు. ఇతర జట్లు గాయాల సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో, చెన్నై మంచి ఆరంభాన్ని పొందితే టోర్నీలో పైచేయి సాధిస్తుందని ఆయన వివరించారు.

Read Also: BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ : కేంద్రం కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>