Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకున్నది. 8.8 లక్షల కోట్లు ఖర్చుతో ఆరు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదించింది. ఇందులో జల్ జీవన్ మిషన్, రైల్వే నిర్మాణాలు, హైవేలు, అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి వంటి కీలక అంశాలు ఉన్నాయి. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన రెండు రైల్వే నిర్మాణ ప్రాజెక్టులు ₹4,474 కోట్ల వ్యయంతో ఆమోదం పొందాయి. ఇందులో సైంథియా–పాకూర్ నాల్గవ రైలు లైన్, సంత్రాగచ్చి–ఖరగ్‌పూర్ నాల్గవ రైలు లైన్ నిర్మాణం ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద 12.6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ఇంటి వద్దనే నాణ్యమైన తాగునీటి ట్యాప్ కనెక్షన్ అందించనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం కూడా రూ.8.7 లక్షల కోట్లకు పెంచారు. మిషన్ అమల్లో వేగం పెంచేందుకు, వచ్చే మూడు నెలల్లో రాష్ట్రాలతో వేర్వేరు ఒప్పందాలు చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

తమిళనాడులో మధురై ఎయిర్‌పోర్ట్‌ను (Madurai Airport) అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయనున్నారు. సంత్రాగచ్చి – ఖరగ్‌పూర్ మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణానికి రూ.2,905 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సైంథియా పాకూర్ మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణానికి రూ.1,569 కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించింది. బద్నావర్-థాండియా-తిమర్వాని మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి రూ.3,839 కోట్లు, జెవార్ విమానాశ్రయం-ఫరీదాబాద్ సెక్షన్ కలిపే 6 లేన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి రూ.3,631 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది.

Read Also: తమిళ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ.. TVK, NDA పొత్తుకు కీలక చర్చలు!

Follow Us On : WhatsApp

 

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>