పటాన్ చెరువులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై కాట శ్రీనివాస్ ఫైర్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు (Patancheru) నియోజకవర్గంలో గురువారం టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy), కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ (Kata Srinivas) మాటల యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య హైడ్రామా నడిచింది. గురువారం బీరంగూడ శివాలయం వద్దకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రావాలని కాట శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరాడు. ఎమ్మెల్యే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమైతే శివాలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయాలని, తాను ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానన్నారు. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు, కాట శ్రీనివాస్ పై ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేయడంతో ఉదయం నుండి కాటా శ్రీనివాస్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రావడంతో హంగామా నడిచింది.

బీరంగూడ శివాలయంలో ప్రమాణం చేయడానికి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాట శ్రీనివాస్ గౌడ్‌ను (Kata Srinivas) అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు, కాట అనుచరుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో అశోక్ నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనంలో హైదరాబాద్ వైపు తరలించారు. మరోవైపు హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్ చెరులోని హనుమాన్ ఆలయాల్లో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: పల్నాడులో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపిన తండ్రి!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>