కలం, వెబ్ డెస్క్: హనుమాన్ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ (Hyderabad)లో జరుగుతున్న శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) వెల్లడించారు. 3 వేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చెప్పారు. శోభాయాత్రకు సంబంధించి అధికారులతో ఇంతకు ముందే సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఇటీవల శ్రీరామనవమికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా యాత్ర ముగించామని, ఇప్పుడు కూడా హనుమాన్ యాత్ర (Hanuman Yatra) ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా హైదరాబాద్ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సారి రెండు కమిషనరేట్‌లు హైదరాబాద్, మల్కాజిగిరి పరిధిలో యాత్ర జరుగుతుందని సీపీ (CP Sajjanar) వెల్లడించారు. హైదరాబాద్ ప్రజలు ప్రతి పండుగకు పోలీసులకు ఎంతో సహకరించారని, ఈసారి కూడా సహకరిస్తారని భావిస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: వికసిత్ భారత్ కోసం వికసిత్ ఆంధ్ర ఆవశ్యకం: ఎంపీ లక్ష్మణ్
Follow Us On: X(Twitter)

