48 గంటల్లోనే మరో బాంబ్ పేల్చిన ఒరాకిల్.. భారీగా లేఆఫ్స్

కలం, వెబ్ డెస్క్ : అమెరికాకు చెందిన టెక్ సంస్థ ఒరాకిల్ తన కంపెనీలోని 30,000 మంది తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేఆఫ్స్ (Oracle Layoffs) ప్రకటించి 48 గంటలు గడవక ముందే సదరు కంపెనీ మరో బాంబ్‌ పేల్చింది. AI ప్రభావం, కంపెనీ మూలధన వ్యయాల కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని కంపెనీలో వర్క్ చేస్తున్న మొత్తం లక్షా 60 వేల మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. ఈ మేరకు మరో విడతలో భాగంగా మరికొన్ని వేల మందిని తొలగించే అవకాశం ఉందంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

దీంతో కంపెనీ నుంచి మెయిల్స్ చూసిన ఉద్యోగులు ఆందోళన చెందుతునున్నారు. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కాగా, ఒరాకిల్ సంస్థ AI కోసం సిద్ధం చేసేందుకు భారీగా నిధులను సమీకరిస్తోంది. ఎన్విడియా, మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజాలకు క్లౌడ్ సేవలు అందించేందుకు 2025లో సుమారు 50 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ వ్యయాలను తట్టుకోవడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి భారీగా లేఆఫ్స్ ను ప్రకటిస్తోంది.

ఇప్పటికే కంపెనీలోని 30వేల మందిని తొలగించింది. ఉద్యోగులకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. HR నుంచి కాల్స్ కూడా లేకుండా జస్ట్ ఒక మెయిల్ ద్వారా లేఆఫ్స్ (Oracle Layoffs) చేయటం సదరు ఉద్యోగులకు దిగ్బ్రాంతిని కలగజేసింది. ముందుస్తు సమాచారం లేకుండా తమను తొలగిస్తే తాము ఇప్పుడు ఎలా జీవనం కొనసాగించాలని సదరు ఉద్యోగులు వాపోతున్నారు. అయితే తాజాగా ఒరాకిల్ సంస్థ నుంచి మెయిల్ రావడంతో మిగతా ఉద్యోగులు సైతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Read Also: ఐ-ప్యాక్ పై ఈడీ మెరుపు దాడులు: ఒకేసారి మూడు నగరాల్లో..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>