పల్నాడులో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపిన తండ్రి!

క‌లం, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల (Macherla)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంద‌న్న కోపంతో ఓ తండ్రి ఆమెను ఊపిరాడ‌కుండా చేసి హ‌త్య చేశాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. మాచ‌ర్ల‌కు చెందిన చౌడేశ్వ‌రి స్థానికంగా ఉండే నాగ‌రాజు అనే యువ‌కుడిని ప్రేమించింది. ఇంట్లో పెద్ద‌లు వీరి పెళ్లికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఈ ప్రేమ‌జంట‌ గ‌త నెల‌లో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం చౌడేశ్వ‌రి తండ్రి ప‌లుమార్లు ఆమెకు ఫోన్ చేసి త‌నతో మాట్లాడాల‌ని, ఇంటికి ర‌మ్మ‌ని అడిగాడు. బ‌ల‌వంతంగా చౌడేశ్వ‌రిని ఇంటికి తీసుకొచ్చాడు. తండ్రీ కూతుళ్లు మాట్లాడుకునే క్ర‌మంలో వాగ్వాదం ఏర్ప‌డింది. త‌మ‌తోనే ఉండాల‌ని, మ‌ళ్లీ వెళ్లొద్ద‌ని తండ్రి కూతురిని వారించాడు. ఆమె త‌న భ‌ర్త‌తోనే ఉంటాన‌ని తేల్చి చెప్పిది. దీంతో ఆగ్ర‌హానికి గురైన తండ్రి కూతురిపై దాడి చేశాడు. అనంత‌రం ఆమె గుండెలపై కూర్చొని, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర విషాదం నెల‌కొంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. చౌడేశ్వ‌రి తండ్రిపై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: ఏపీ రాజధానిగా అమరావతి.. పార్లమెంట్ ఆమోదం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>