ఢిల్లీ పేలుడు ఘటన విచారణలో భాగంగా NAAC.. అల్-ఫరా యూనివర్శిటీ(Al Falah University)కి నోటీసులు జారీ చేసింది. అందులో పనిచేస్తున్న కొందరు వైద్యులు ఈ పేలుడు అంశంలో అనుమానితులుగా ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్(NAAC) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌లో గుర్తింపు గురించి తప్పుడు సమాచారం ప్రచురించడంతో ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది.
‘‘అల్-ఫలా వర్సిటీ(Al Falah University) న్యాక్ గుర్తింపు పొందలేదు. అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. సైట్‌లో మాత్రం గుర్తింపు ఉన్నట్లు ప్రదర్శించింది. ఇలా చేయడం తప్పు. ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదారి పట్టించడమే అవుతుంది’’ అని న్యాక్ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
Read Also: గ్లోబ్‌ట్రోటర్.. అభిమానులకు జక్కన్న జాగ్రత్తలు
Follow Us on: Instagram

